19 June, 2026 | 5:25 PM

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ చైర్మన్‌గా గాజవాడ నాగరాజు

19-06-2026 03:52 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన సాక్షి విలేఖరి గాజవాడ నాగరాజును తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ చైర్మన్‌గా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... సమాజంలో ఆర్యవైశ్యులకు గుర్తింపు ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా, రాజకీయంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం కైలాస్ శ్రీనివాసరావు, తెలంగాణ రీజినల్ చైర్మన్ శెనిశెట్టి గౌరీశంకర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.