19 June, 2026 | 4:30 PM

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

19-06-2026 03:42 PM

తహశీల్దార్ ద్వారా ప్రభుత్వానికి వినతి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపుమేరకు స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కొరుతూ శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జి.వో.272 సవరణ చేసి దోంగ బంగారం రికవరి కేసుల నుండి కాపాడలని, 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకారులకు రూపాయలు 5వేలు పెన్షన్ ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.