వ్యాపారానికి డొమెస్టిక్ సిలిండర్లను వాడొద్దు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 15(విజయక్రాంతి): గృహ అవసరాల కోసం కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ, పెట్రోలు కొరత లేదని తెలిపారు. ఎల్పీజీ గోదాములు, పెట్రోలు బంకుల వద్ద స్టాక్ వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. కృత్రి మ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, మున్సిపల్ కమిషనర్లు, ఎల్పీజీ డీలర్లు, పెట్రోలు బంక్ యజమానులు పాల్గొన్నారు.




