నిర్మల్‌లో సినీనటి ఐశ్వర్య సందడి
16-03-2026 12:12 AM
వండర్ ల్యాండ్ ప్రారంభోత్సవానికి రాక
నిర్మల్, మార్చి ౧౫ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఆదివారం సందడి చేశారు. రానాపూర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నిర్మల్ వండర్ ల్యాండ్ ప్రదర్శనను ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేలతో కలిసి ప్రారంభించారు. నిర్మల్ పట్టణం అంటే నాకు ఎంతో గౌరమని..
నిర్మల్ రావడం చాలా సంతోషం కలిగించిందని సినీనటి పేర్కొన్నారు. మారుమూల నిర్మల్ జిల్లాలో వండర్ ల్యాండ్ వినోదం కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్వాకులు ప్రమోద్ చంద్ర రెడ్డి. కిరణ్ కుమారసాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు




