19 April, 2026 | 7:28 AM

మీకు అభివృద్ధి కూడా తెలుసా?

26-08-2024 04:47 AM

తేజస్వీయాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ సెటైర్లు

పాట్నా, ఆగస్టు 25: బీహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు అధికారంలో ఉన్నా అన్ని దరిద్రాల్లో ఇప్పటికీ బీహారే మొదటి స్థానంలో ఉన్నదని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ చేసిన విమర్శలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సెటైర్లు వేశారు. కులం, దోపిడీ, మద్యం మాఫియా నేరాల గురించి తేజస్వీయాదవ్ మాట్లాడితే దానిపై నేను స్పందించాల్సిందే. ఆయన అభివృద్ధి మోడల్ గురించి మాట్లాడితే నవ్వొస్తున్నది. వాళ్లు 15 ఏండ్లు అధికారంలో ఉన్నారు. కానీ, జీడీపీ అంటే ఏమిటో కూడా వాళ్లకు తెలియదు. ‘ఆరు నెలల ముందు ఆయన డిఫ్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆయనకు బీహార్ స్విట్జర్లాండ్‌లా కనిపించింది. ఆరు నెలల తర్వాత ప్రతిపక్షంలోకి రాగానే నేరమయంగా మారిందా?’ అని ప్రశ్నించారు.