11 July, 2026 | 1:23 AM

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?

11-07-2026 12:13 AM
  1. ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులు రాంగ్ రూట్ లోను 
  2. ప్రతిరోజు ఇదే తీరు.. అడిగే వారి లేరూ!
  3. ట్రాఫిక్ నియమాలు పాటిస్తారు అంటున్న పోలీస్ శాఖ 
  4. పట్టనట్లు వ్యవహరిస్తున్న కొన్నిప్రైవేట్ స్కూల్ బస్సులు 

జడ్చర్ల, జూలై 10 : ప్రైవేటు..ప్రభుత్వ అని కాదు.. నిబంధనలు పాటిస్తున్నామా లేదా అనేది  చాలా ముఖ్యం. పేరుకు ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను వారి పాఠశాలకు చేరవేసేందుకు ఆ బస్సులు ప్రతిరోజు రాంగ్ రూట్ లోనే ప్రయాణాలు కొనసాగిస్తు ఇదే పద్ధతి అంటూ జనమే అసహనం వ్యక్తం చేస్తుండ్రు.

తప్పు అని తెలిసిన తిరిగి రావాలంటే వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలియదు కానీ ప్రతి దినం వారు రాంగ్ రూట్ నే రైట్ రూట్ గా ప్రయాణం చేస్తూ  ప్రమాదాలకు దారి చూపే ప్రయత్నం చేస్తుండ్రు. రెప్పపాటు సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు అదుపు తప్పితే పెను ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితులు జడ్చర్ల పట్టణంలో చోటు చేసుకుంటున్నాయి. 

నిబంధనలు వారికి అనుకూలమేనా!

 క్రమశిక్షణకు మారుపేరు మా పాఠశాల అని చెప్పుకునే పాఠశాలలు ఇలా క్రమశిక్షణ తప్పి విద్యార్థుల ప్రాణాలతో పాటు వాహన చోదకుల ప్రాణాలను పండగ పెట్టేలా ప్రతిరోజు రాంగ్ రూట్లో వెళ్లి విద్యార్థులను ఎ క్కించుకోవాల్సిన పరిస్థితి ఏముందని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొంత దూరం ఎక్కువైనా సరైన మార్గంలో ప్రయాణించి విద్యార్థులను ఆ బస్సులో ఎ క్కించుకొని వారి పాఠశాలకు చేర్చాల్సి ఉన్నప్పటికీ కొందరు ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లు వారి ఇష్టను సారంగా వ్యవహరించడంతో  ఎప్పుడు ప్రమాదం చోటు చేసుకుం టుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

చర్యలు తీసుకుంటేనే క్షేమం...

 స్కూల్ బస్సుల ప్రయాణ విషయంలో నిబంధనలకు లోబడి ప్రయాణించకుండా తిరుగు ప్రయాణంలో  ఎదురు ప్రయాణం కొనసాగించడం తో వాహన చోదకులు ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సంబంధిత అ ధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటేనే క్షేమంగా ప్రయాణికులు తమ తమ ప్రయాణాలను కొనసాగించే అవకాశాలు మెండు గా ఉన్నాయి. ఇప్పటికైనా ఆయా బస్సుల యాజమాన్యాలతో పాటు సంబంధిత అధికారులు ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.