27 February, 2026 | 5:00 PM

Breaking News

మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి   •   పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి   •   రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన చేయాలి   •   రక్తదానం చేసి ప్రాణ రక్షకుడు యువకుడు   •   విబి బెంగుళూరు అయ్యంగార్ బేకరి, స్వీట్ హౌస్ ను ప్రారంభించిన శ్రీను బాబు   •   రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి   •   చేవెళ్లకు బదిలీ అయిన ఆర్డీఓకు ఘన సత్కారం   •   గృహ ప్రవేశ మహోత్సవంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •  

డాక్టర్లు మానవత్వంతో పనిచేయాలి

27-02-2026 12:00 AM
  1. పేదలకు వైద్య సేవలు అందించాలి

నల్లగొండ మెడికల్ కళాశాలను ఉత్తమమైన కళాశాలగా తీర్చిదిద్దుతా

రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ టౌన్, అక్టోబర్ 26 : డాక్టర్లు తెల్ల కోటుకు పరిమితం కాకుండా, మానవతా దృక్పథంతో పేదలకు వైద్య సేవలందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో అద్వితీ -2026 పేరున నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నావైద్యవృత్తి పవిత్రమైనదని అన్నారు . నలాగొండ ప్రభుత్వ వైద్య కళాశాల అన్నిఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబడిందని, వైద్య కళాశాలలో చదివే విద్యార్థులు సబ్జెక్టులతో పాటు, మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని, తెల్ల కోటు బాధ్యతకు సింబల్ అని అన్నారు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తీర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని , వైద్య కళాశాల విద్యార్థుల కోసం రెండు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నెలలోపు వీటిని మంజూరు చేస్తామన్నారు.

ఇటీవలే ఏఐజి ఆసుపత్రి డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకురావడం జరిగిందని, ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన పి జి విద్యార్థులను పరిశోధన నిమిత్తం తన ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం 45 మంది చొప్పున తీసుకునేందుకు అంగీకరించారని, ఇందుకు సంబంధించిన ఎం ఓ యు ను త్వరలోనే కుదుర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు నల్లగొండ పట్టణంలో వైద్య విద్యనే కాకుండా, చదువుకోసం ప్రతి పేద విద్యార్థికి సహకారం అందిస్తామని, ఇందుకు తమను సంప్రదించాలని, విద్యాభివృద్ధిలో భాగంగా బోట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను,

అలాగే ప్రతిక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని మరికొన్ని పాఠశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని, 900 కోట్ల రూపాయలతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్లగొండను స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా చేస్తామని తెలిపారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాలలో పేద ప్రజలకు సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అమీర్ ఆశ్రఫ్ అలీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, డాక్టర్లు ఆయా వైద్య విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు