యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతల స్వీకరణ
ఆలేరు, ఫిబ్రవరి 26 : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా ఉన్న ఎం హనుమంతు రావుని ప్రభుత్వం దేవదాయ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేయడంతో జిల్లా నూతన కలెక్టర్ గా 2015 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన అనురాగ్ జయంతి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనురాగ్ జయంతి గతంలో భోధన్, ఖమ్మం జిల్లాలో సబ్ కలెక్టర్ గా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఖైరతాబాద్ జోనల్ కమీషనర్‌గా పని చేశారు,
ప్రస్తుతం జిహెచ్‌ఎం సి ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ లో జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ జయంతి బదిలీ పై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అట్టడుగు ప్రజలకు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.




