4 April, 2026 | 2:44 AM

దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

04-04-2026 01:10 AM

కామారెడ్డి, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  దొడ్డి కొమురయ్య జయంతి నీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్  మధు మోహన్, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమర వీరుడని అన్నారు, రెండు పదుల వయసు నిండకుండానే భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం రైతాంగ పోరాటం చేసి అమరుడైన మహా వీరుడని తెలిపారు.

ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని అన్నారు, ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.  బహుజన సంఘాల నాయకులు, కుర్మ సంఘం నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సహాయ బీసీ అభివృద్ధి అధికారి  చక్రధర్, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, గణేష్ నాయక్, విఠల్, నాగరాజు, కుర్మ సంఘం నాయకులు మార్కంటి  భూమయ్య, సంజీవ్, స్వామి, అశ్వక్, నరేష్, స్వప్న, సునీత, పవన్, జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

దోమకొండలో..

దోమకొండ, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు  నిర్వహించారు. ముత్యంపేట  రోడ్డు క్రాసింగ్ వద్ద ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి సర్పంచ్ నరసయ్య, మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్, కురుమ సంఘం అధ్యక్షుడు నాగ నాగరాజు పూల దండలు వేసి, ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్  బొమ్మెర శ్రీనివాస్,  వార్డ సభ్యులు పాలకుర్తి శేఖర్, నేతుల బాలమణి, కాంగ్రెస్ నాయకులు నల్లపు శ్రీనివాస్, షమ్మీ, నయీం, నేతుల సుధాకర్,  పేతురు మల్లేశం, గూని కొమరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.