ప్రజాపాలన గందరగోళంలో ప్రజలు
భీమదేవరపల్లి ఏప్రిల్ 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం వాస్తవానికి ప్రజల సమస్యలను పరిష్కరించే కార్యక్రమంగా కాకుండా కేవలం ప్రచార కార్యక్రమంగా మారిపోయిందని మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం అని బిజెపి నాయకులు పైడిపల్లి పృథ్వీరాజ్ అన్నారు. ప్రభుత్వం 99 రోజుల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పుకుంటున్నా, ఇండ్ల నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతుందన్నారు మంజూరైన లబ్ధిదారులు వ్యక్తిగత కారణాలతో ఇల్లు నిర్మించుకోలేకపోతే, ఆ అవకాశం మరో అర్హుడైన దరఖాస్తుదారునికి ఇవ్వాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉంది.
కానీ మండల ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అధికారులు స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. దీనికి ప్రధాన కారణం అవగాహన లేని ఇందిరమ్మ కమిటీలే అని విమర్శించారు. మండల వ్యాప్తంగా గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు (జీరో బిల్లు) ఎంతమందికి లభించింది అనే విషయంపై స్పష్టత లేదు. ప్రజలు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, అధికారులు పట్టించుకోకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు నష్టపోయారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటార రవి ప్రశ్నించారు.వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాకపోవడం బాధాకరం అన్నారు. పేదల కోసం ఉన్న పథకాలు పేదలకు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ప్రచారం మానేసి, ప్రజల సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.




