కేంద్ర మంత్రితో శశిథరూర్ సెల్ఫీ పార్టీ మార్పు ఖాయమైనట్లేనా?
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ సీనియ ర్ నేత, ఎంపీ శశిథరూర్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు కొద్దిరోజులుగా ఊహాగా నాలు ఉన్నాయి. మోదీ అమెరికా పర్యటనను ఆయన కొనియాడుతూ చేసిన పోస్ట్ అందుకు బలాన్నిస్తున్నది.
తాజాగా భారత్ యూకే వాణిజ్య ఒప్పందంపై చర్చల అన ంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ ట్రేడ్ జోనాథన్ రేనాల్డ్స్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పునరుద్ధరణ జరిగింద ని ఆ పోస్టులో వ్యాఖ్యానించడం రాజకీయపరంగా ప్రాధాన్యతను సంతరించుకుంటు న్నాయి. శశిథరూర్ ఆ ఊహాగానాలన్నింటినీ కొట్టిపడేస్తున్నారు. తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీకి తన అవసరం లేదనిపిస్తే చెప్తే బాగుంటుందని, తన ముందు ఇంకా ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు.






