9 May, 2026 | 7:54 PM

మహిళపై కుక్కల దాడి

23-06-2024 12:05 AM

రాజేంద్రనగర్, జూన్ 22 : నగర శివారు మణికొండ మున్సిపాలిటీలో వీధి కుక్కలు ఒక్కసారిగా ఓ మహిళను చుట్టుముట్టాయి. కుక్కలు ఒక్కసారిగా అరుస్తూ మహిళ మీద దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో భయాందోళనకు గురైన మహిళ వాటి నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడింది. 15 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టగా ఐదు నిమిషాల పాటు పోరాడింది.  అనంతరం వాహనదారులు గుర్తించి వీధికుక్కలను తరిమికొట్టారు. దీంతో మహిళకు ప్రాణాపాయం తప్పింది. వీధి కుక్కలతో స్థానికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, మున్సిపల్ సిబ్బంది స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.