9 May, 2026 | 6:45 PM

సెంట్రింగ్ బాక్స్‌ల దొంగల అరెస్టు

23-06-2024 12:05 AM

కౌడిపల్లి జూన్ 22: సెంట్రింగ్ బాక్స్‌లు దొంగిలించే ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ ఎస్పీ బాలస్వామి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న పెద్దపురం అశోక్ అనే సెంట్రింగ్ మేస్త్రీ పాపన్నపేట మండలం నాగ్సానిపల్లిలో నూతన ఇంటి నిర్మాణం కోసం సెంట్రింగ్ బాక్స్‌లు ఉంచగా, అవి మరుసటి రోజు చోరీకి గురయ్యాయి. దీంతో అశోక్ 12న పోలీస్ సేష్టన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున కౌడిపల్లి ఎస్సై రంజిత్‌రెడ్డి సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్ ఆటో, బైక్‌పై అటుగా వచ్చిన కొందరు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బందితో కలిసి పారిపోతున్న వ్యక్తులను పట్టుకొని విచారించగా సెంట్రింగ్ బాక్స్‌లు దొంగతనం చేసినట్లు అంగీకరించారు. నిందితులను ముక్కని నవీన్, వడ్డె శ్రీకాంత్, డేరంగుల వడ్డె యాదయ్య, వడ్డె దుర్గాప్రసాద్, డేరంగుల శ్రీనివాస్, దుండగుల ప్రవీణ్‌గా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.