9 May, 2026 | 8:51 PM

ఐదుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

23-06-2024 12:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): రాచకొండ కమిషనరేట్ పరిధిలో వివిధ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 5 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ రాచకొండ సీపీ తరుణ్‌జోషి శనివారం ఆదేశాలు జారీ చేశారు. కీసర పీఎస్‌లో ఎస్‌హెచ్‌ఓ, సైబర్ క్రైమ్ విధులు నిర్వహిస్తున్న ఏ వెంకన్నను సైబర్ క్రైమ్ విధుల నుంచి తప్పించి కీసర ఎస్‌హెచ్‌వోగా నియమించారు. చౌటుప్పల్‌లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కే సీతారాంను కందుకూరు పీఎస్ ఎస్‌హెచ్‌వోగా, కందుకూర్ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న మహమ్మద్ మక్బూల్ జానీని సైబర్ క్రైమ్స్‌కు, యాదాద్రి ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న కే నాగరాజును మీర్‌పేట్ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా, హయత్‌నగర్‌లో విధులు నిర్వహిస్తున్న కే శ్రీనివాస్‌ను మహేశ్వరం ఎస్‌వోటీకి బదిలీ చేశారు.