మృతదేహాన్ని పీక్కతిన్న కుక్కలు
- జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన
కనీస భద్రతా చర్యలు శూన్యం
బాధ్యులపై చర్యలు తప్పవు: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, మార్చి 2 (విజయక్రాంతి): మహబూ బ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో అమానుష ఘటన జరిగింది. ఆస్పత్రిలో ఓ వ్యక్తి మృతేహాన్ని కుక్కలు పీక్కతిన్న ఘటన సోమవారం వెలుగుచూసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందాడు. అత్యంత బాధాకరమైన విషయం ఏమి టంటే మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ కనీస భద్రత లేక పోవడంతో మృతదేహం కుక్కలపాలు అయింది.
మృతదేహాన్ని శునకాలు పీక్కుతుంటున్న హృద య విదారక ఘటన అందరినీ కలచివేసింది. మనిషి మృతదేహాన్ని పీక్కు తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






