3 March, 2026 | 10:29 PM

సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ

03-03-2026 12:39 AM
  1. మొదటి దశలో జిల్లాకు 10 చొప్పున పంపిణీ -
  2. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  

హైదరాబాద్, మార్చి2 (విజయక్రాంతి) : రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రికరణను వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం 2025.26 సంవత్సరానికి సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ( ఎస్‌ఎంఏఎం) పథకం కింద పలు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై  అం దజేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

ఇప్పటికే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ,  మహిళా రైతులకు ప్రాధాన్యంతో యంత్రాలను అందజే స్తున్న ప్రభుత్వం, రైతుల కోరిక మేరకు ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ డ్రోన్లను కూడా సబ్సిడీపై అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మం త్రి పేర్కొన్నారు. మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 చొప్పున వ్యవసాయ డ్రోన్లను 40 శాతం సబ్సిడీతో, గరిష్టంగా రూ.4 లక్షల వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు (పీఎఫ్ వోలు), ప్రాథమిక సహకార సంఘాలకు అందచేయడానికి నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వం ఒకవైపు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూనే, ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం పసుపు ఉడకపెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పామ్ కోతకు టెలిస్కోపిక్ హార్వెస్టింగ్‌పోల్, ఉద్యానవన పంటల కోత పరికరాలనూ సబ్సిడీలో చేర్చిందన్నారు. అర్హతలు, సబ్సిడీ శాతం, దరఖాస్తు విధానం వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.