18-07-2025 12:25:18 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) అమ్రబాద్ మండలానికి చెందిన రెండు గ్రామాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మార్చుతూ జిఓ 26 ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే వంశీ కృష్ణ(MLA Vamsi Krishna) తెలిపారు. ప్రజా అవసరాలు, అభ్యర్ధన మేరకు దోమలపెంటను బ్రహ్మగిరి, ఈగలపెంటను కృష్ణగిరిగా నామకారణం చేశారు. వీటి ఉత్తర్వులను అందజేసినట్లు తెలిపారు. ఈ మార్పులు ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల ప్రకారంగా అమలులోకి వచ్చాయన్నారు.