18-07-2025 12:15:57 PM
ఈటెల వర్గాన్ని పక్కపెడుతున్నారని ఆరోపణ.
హుజురాబాద్,(విజయక్రాంతి): బిజెపి పార్టీకి చెందిన క్రియాశీల కార్యకర్త, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్(BJP Assembly Convener resigns) గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాడ గౌతమ్ రెడ్డి గురువారం పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలం సృష్టించారు. హుజురాబాద్ పట్టణంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన ముగియకముందే రాజీనామా చేయడం చర్చ నియాంశంగా మారింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపిలో వర్గాలు లేవని, అంతా మోడీ గ్రూపు ఒకటేననితెలిపారు. మాడ గౌతంరెడ్డి మాత్రం ఈటెల వర్గాన్ని పక్కకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. 2022 సంవత్సరం నుండి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నానని, పార్టీలో గౌరవం లేదని పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు.