calender_icon.png 11 January, 2026 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12న శ్రీరామ్ నగర్ లో ముగ్గుల పోటీలు

10-01-2026 05:08:53 PM

మెంగని రాధ చంద్రశేఖర్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు శ్రీరామ్ నగర్ వీధిలో గణపతి నవరాత్రులు నిర్వహించే స్థలంలో ఈనెల 12 సోమవారం ఉదయం 10 గంటల నుండి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మెంగని రాధ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ వీధిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, మన పండుగలను సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి.

మా వంతుగా మేము కృషి చేస్తున్నామని అందులో భాగంగానే ఈ  ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని,  ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి ముగ్గులు ఉచితంగా అందించి ప్రథమ ద్వితీయ తృతీయ, ఇట్టి పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్, పరిసర ప్రాంత మహిళలు అందరూ పాల్గొనవచ్చునని ఎంతమందికైనా రంగులు ఉచితంగానే అందిస్తామని మిగతా విషయాలకు ఈ క్రింది నెంబర్లో సంప్రదించాలని 9912078519 మేం గాని చంద్రశేఖర్ రాధా కోరారు.