కూసుమంచి గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ
07-04-2026 12:53 AM
కూసుమంచి, ఏప్రిల్ 6(విజయక్రాంతి): కూసుమంచి మండల కేంద్రంలోని వర్తక సంఘం ఆధ్వర్యంలో సొంత నిధుల రూ.60,000 విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ను ఇంచార్జ్ ఎంపీడీవో రాజారావు సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ కి అందజేశారు. సోమవారం కూసుమంచి మండలం కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రీజర్ బాక్స్ ను వర్తక సంఘం బాధ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాళ్లబండి నీరజ, ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ, వర్తక సంఘం అధ్యక్షులు చోడవరపు కృష్ణారావు, వర్తక సంఘం సభ్యులు మాజీ ఎంపీటీసీ సభ్యులు మాదాసు ఉపేందర్, మాజీ సర్పంచులు గుండా దామోదర్ రెడ్డి, చెన్న మోహనరావు, వార్డు సభ్యులు చెరుకుపల్లి వీరయ్య, అంతోటి వెంకన్న, అర్వపల్లి ఉపేందర్ గౌడ్ గ్రామ పెద్దల పాల్గొన్నారు.




