19 March, 2026 | 1:25 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

పోలీసులు బలవంతం చేయొద్దు

23-07-2024 12:22 AM

కన్వర్ యాత్ర ఫుడ్‌స్టాళ్ల ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే

న్యూ ఢిల్లీ, జూలై 22: వివాదాలకు కేంద్ర బిందువైన కన్వర్ యాత్రకు సంబంధించి పోలీసులు జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శివభక్తులు ప్రతి ఏడాది ముజఫర్ నగర్ జిల్లాలో కన్వర్ యా త్రను నిర్వహిస్తుంటారు. గతేడాది ఈ యా త్రలో హింస చెలరేగిన నేపథ్యంలో.. యాత్ర జరిగే మార్గంలో ఉండే దుకాణ యజమానులకు పోలీసులు అందించిన నోటీసులు వివాదాలకు కేంద్రబిందువుగా మా రాయి. యాత్ర జరిగే రోజుల్లో ఆ మార్గంలో ఉండే దుకాణ యజమానులు తమ పేర్లతో కూడి న బోర్డులను స్టాల్స్ ముందు ఉంచాలని యూపీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. యజమానులు వడ్డించే ఆహారాన్ని మాత్ర మే ప్రదర్శిస్తారని కోర్టు స్పష్టం చేసింది.