వీటిని నిర్లక్ష్యం చేయొద్దు!
ముఖం, కాళ్లు, చేతులు ఒకవైపు మాత్రమే మొద్దుబారడం, కంటి చూపులో తేడా రావడం.. శ్వాసలో మార్పులు.. ఛాతీలో నొప్పి.. వంటి లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. ఈ లక్షణాలు బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించినవని పరిశోధనలు చెబుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ ఆరోగ్యానికి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. మన శరీరంలో అన్ని అవయవాల లాగానే మెదడు కూడా ఎంతో ముఖ్యమైనది.
మెదడు ఆరోగ్యంగా ఉండటం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. అయితే స్ట్రోక్‌కు ముందు కొన్ని సూచనలు మన శరీరంలో కనిపిస్తాయి. ఆ లక్షణాలను గమనించి, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి నెల రోజుల ముందు నుంచే కొన్ని లక్షణాలను పసిగట్టడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.
ముఖ్యంగా ముఖం, కాళ్లు, చేతులు ఒకవైపు మాత్రమే మొద్దుబారటం, కంటి చూపులో తేడా రావడం, శ్వాసలో మార్పులు రావడం, ఛాతీలో నొప్పి రావడం, ముఖ్యంగా ఛాతీలో ఎక్కువగా నొప్పి వచ్చిందంటే స్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యం. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.




