23 August, 2026 | 3:05 AM

30% కమీషన్ సర్కార్ ఇది!

23-08-2026 01:24 AM
  1. ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారు? 
  2.    22 ఏ బాధితుల ఆవేదన నన్ను కలచివేసింది
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇది 30 శాతం కమీషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని తెలిపా రు. 22 ఏ బాధితుల ఆవేదన చెబుతుం టే గుండె కలిచివేస్తోందని అన్నారు. శనివారం బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీకి చెందిన బాధితు లు హరీశ్‌రావును కలిసి తమ సమస్యను చెప్పారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వందలాది మంది 22 ఏ బాధితులు వచ్చి తమ ఆవేదన కలచివేసిందన్నారు. సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.

కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాల యానికి వెళ్తే.. ఆస్తి ప్రొహిబిషన్‌లో ఉందన్న విషయం తెలియడంతో కాలనీవాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నారని మండిపడ్డారు.

దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు 22 ఏ భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారు. దీనికి మీ సమాధానం ఏమిటి రేవంత్ రెడ్డి? అని ప్రశ్నిం చారు. బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న బాధితులందరూ అధైర్యపడవద్దని, ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా సరే మీ ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్‌ఎస్ తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మాటలు పక్కనబెట్టి, తక్షణమే ఆయా కాలనీలను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల     పక్షాన బీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని      హెచ్చరించారు.