అతిగా వాడితే అంతే!
జబ్బుచేస్తే తొలిప్రయత్నంలోనే కోలుకోవాలని చాలామంది ఇష్టానుసారంగా మందులు వాడుతున్నారు. కొందరైతే అదేపనిగా బఠానీలు నమిలినట్టుగా ట్యాబ్లెట్స్‌ను మింగేస్తుంటారు. అయితే అతి ఎప్పుడూ ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు అతిగా మందులు వాడితే కిడ్నీ, కాలేయంపై ప్రభావం చూపుతాయి.
- మోతాదు మించితే
- శరీరంపై తీవ్ర ప్రభావం
- దీర్ఘకాలిక రోగులు జర జాగ్రత్త
- కాలేయ సమస్యలు..
కొంతమందిలో మందు తక్కువ ప్రభావం చూపిస్తే కొందరిలో మత్తు ప్రభావం ఎక్కువగా ఉండచ్చు. అవి శరీరతత్వాన్ని సరిపోతాయా లేదా అన్నది తెలుసుకోకుండా మందులు వాడుతున్నారు. అయితే కొన్నిరకాల మందులు శరీరానికి సహకరించవు. ఆ మందుల వాడకం వల్ల వచ్చే రియాక్షన్ జీవక్రియపై ప్రభావం చూపుతాయి. అలాగే కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫ్టెక్స్ కూడా వస్తాయి.
డాక్టర్స్ సూచించిన దానికన్నా అధిక మోతాదులో మందులు వాడితే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒక వేళ ఎక్కువ మోతాదులో మందులు ప్రతిరోజూ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారినపడేలా చేస్తాయి. కొన్ని సందర్భాలలో స్వల్ప మోతాదు మందులు సైతం పిలలపై ప్రభావం చూపిస్తాయి. అది ఒక్కోసారి ఆస్తమా, గుండెపోటుకు దారితీయవచ్చు. ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. అధిక మోతాదుతో వాంతులు, కాళ్లు నొప్పులు, విరేచనాలు, తల తిరగడం, తూలడం, మత్తుగా ఉండడం, ఒకరకమైన భయం, రక్త పోటు తగ్గడం, శ్వాస తీసుకోవడం లాంటి లక్షణాలు బాధిస్తాయి. అంతేకాదు.. ముఖం పాలిపోయి ఉండటం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలు కూడా బాధిస్తాయి
దీర్ఘకాలిక జబ్బులున్నవారు మొదట వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లకుండా ఏళ్ల తరబడి అవే మందులను వాడుతున్నట్టు పలు సర్వేలో తేలింది. అయితే మందులు వాడటం వల్ల కొన్నిసార్లు సదరు వ్యాధి తీవ్రత పెరిగి ఉండవచ్చు లేదా తగ్గి ఉండవచ్చు. దీనిని బట్టి మళ్లీ వైద్యుల వద్దకు వెళితే డోసును అడ్జస్ట్ చేసి ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో మందులు వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ వైద్యుల సూచన లేకుండా ఎడా పెడా మందులు కొని వాడితే అది మొదటికే మోసం చేస్తుంది. మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ అతిగా వాడితే శరీరం వాటికి అలవాటు పడిపోయి కొత్త రకం యాంటిబయాటిక్స్ కోసం ఎదురుచూస్తుంది. లైంగిక ఉత్ప్రేకా లు అతిగా వాడితే గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ లాంటి వి అతిగా వాడితే కడుపులో పుండ్లు, కాలేయ సమస్యలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. పీరియడ్స్ రావ డానికి, పీరియడ్స్ వాయిదా పడేందుకు వాడే మందు లు సైతం వైద్యుల సూచన లేకుండా వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని మందులు అతిగా వాడితే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉదాహరణకు జ్వరానికని వేసుకునే మాత్రలు సురక్షితమైనవి అనే ప్రచారం ఉంది. కానీ ఎక్కువ మోతాదులో వేసుకుంటే అవి కూడా కాలేయాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. అలా గే ఎక్కువ మంది తరచూ వాడే పెయిన్ కిల్లర్లు అతిగా వాడినా ఈ కాలేయ సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే గర్భ సమయంలో మందుల వాడకం పిండంపై తీవ్రప్రభావం చూపుతుంది. అలాగే గర్భిణికి సమస్యలు తప్పవు అంటు న్నారు వైద్యులు.
డాక్టర్‌ను సంప్రదించి వాడాలి
చాలామంది చిన్న చిన్న రోగాలకే మందులను వాడేస్తున్నారు. అందులో కొన్ని హైడోస్ కూడుకున్నవి కూడా ఉంటాయి. వాటిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రకమైన మందులు కొద్దిరోజుల వాడితే పర్వాలేదు. కానీ అదేపనిగా వాడితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పెయిన్ కిల్లర్‌ను ఎక్కువ కాలం వాడితే కిడ్నీ, లివర్ లాంటివాటిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి జ్వరమొచ్చినా, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడినా.. కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సూచించిన మందులు వాడితే రోగం త్వరగా నయమవుతుంది.
నొప్పుల మందుతో కిడ్నీలకు ప్రమాదం
చాలా మంది నొప్పుల మాత్రలను ఎక్కువగా వాడేస్తున్నారు. అయితే ఎప్పుడో ఒకసా రైతే ఇబ్బంది లేదు. కానీ ప్రతిరోజూ ఇదే విధంగా నొప్పుల మాత్రలు, స్టెరాయిడ్స్ కొని వాడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. దానివల్ల కడుపులో అల్సర్లు ఏర్పడమే కాకుండా కిడ్నీలు కూడా ఫెయిలవుతాయి. కొన్నిసార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు.
ప్రతి మందుకూ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ మందు ఎవరికి ఎలా పనిచేస్తుందో వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బాధిస్తే వీలైనంతవరకు మందుల కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు ప్రకృతి సహజంగా అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు పరిష్కార మార్గాలను వెతకాలి. జలుబు చేయగానే మాత్ర వేసుకోకూడదు. ఆవిరి పట్టడం, అల్లంతో కషా యం సేవించడం వంటివి చేస్తే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.




