12-09-2024 03:30:00 AM
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (విజయక్రాంతి): గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశా ల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించా లని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. బుధవారం ఆమె అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ గణేశ్ నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో రోడ్లపై పడిన చెత్త, ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించేందుకు శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి రోడ్లను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. రహదారులపై డార్క్ స్పాట్స్ లేకుం డా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పాట్ హోల్స్ పూడ్చాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, యూబీడీ, ఏఈలు, పోలీస్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎలాంటి సమస్యలు రాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ ఆదేశించారు.