calender_icon.png 11 November, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయించిన ఎమ్యెల్యేలకు చీరె, గాజులు

12-09-2024 12:00:00 AM

దమ్ముంటే  రాజీనామా చేయాలి

రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కడి యం శ్రీహరి, దానం నాగేందర్  దమ్ముంటే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన వారికి చీరె, గాజులు పంపుతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఎమ్మె ల్యే దానం నాగేందర్ పూటకో పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. ఆయన్ను పార్ల మెంట్ ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. త్వరలోనే ఆయన శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారని జోస్యం చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి పెద్ద మోసకారి అని అన్నారు. పొద్దున బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు వచ్చి, సాయంత్రం కాంగ్రెస్‌లో చేరారని ధ్వజమెత్తారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇప్పటివరకు కాంగ్రెస్ కండు వా కప్పుకోలేదని, ఆ పార్టీ నేతలు అనడం విడ్డూరమన్నారు. పార్టీ మారిన వారు హై కోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్ని కలు రావడం తథ్యమని జోస్యం చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాలయాపన చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.