calender_icon.png 7 February, 2026 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఓటు వేయండి

07-02-2026 07:34:56 PM

రేవంత్ రెడ్డి పాలన లో తెలంగాణ స్వర్ణ యుగం

రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఆలోచించి అభివృద్ధి కోరుతూ కాంగ్రెస్కు ఓటు వేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. శనివారం కామారెడ్డిలో మున్సిపల్ పరిధిలోని 19, 20, 21, 22, 23, 24, 25, వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. అభివృద్ధికి ఓటు వేయండి అని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే సమన్వయ లోపంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.

రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ స్వర్ణ యుగంగా మారుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరోగ్యారంటీలను యుద్ధ ప్రతిపాదికన అమలు చేస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. మహిళలకు గ్యాస్ సిలిండర్ రూ. 500 ల సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి అన్నారు.

రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు 6000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారన్నారు. ఉద్యోగ నియమకాలు గత రెండేళ్లలో 51 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఆశాజ్యోతి గా నిలిచారన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం మైనార్టీల విద్య ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నేరేళ్ల శారద మాట్లాడుతూ నాడు ఇందిరమ్మ పాలనలో మహిళలకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు తెలంగాణలో మళ్లీ అభయహస్తం గ్యారెంటీ ల ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ప్రభుత్వం కేవల మాటలకే పరిమితం కాకుండా చేతుల్లో మహిళల ఆర్థిక సామాజిక భద్రతను చాటుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, వాడు కౌన్సిలర్ అభ్యర్థులు స్థానిక కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.