22 April, 2026 | 4:02 AM

హరిత హోటల్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దు

28-06-2024 12:09 AM

సీఎంకు మాజీ ఎమ్మెల్యే చాడ విజ్ఞప్తి 

హైదరాబాద్,జూన్ 27 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కడెం ప్రాజె క్టు వద్ద  గల హరిత హోటల్‌ను టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నే నడిచేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వీటిని నిర్మించినట్లు గుర్తుచేశారు. లాభాల్లో నడు స్తున్న ఈ హరిత ప్లాజాను ప్రైవేట్‌పరం చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభు త్వ ఆధీనంలోని హోటళ్లను ప్రైవేట్ పరం చేయాలనుకొనే ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మధ్యతరగతి ప్రజల కోసమని వైఎస్‌ఆర్ వీటిని నిర్మించారని, వాటిని ప్రైవేట్‌పరం చేయాలనుకుంటున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.