పీవీ అడుగుజాడల్లో దేశం నడుస్తోంది
28-06-2024 12:12 AM
మంత్రి కొండా సురేఖ వెల్లడి
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : మాజీ ప్రధాని, భార తరత్న పీవీ నరసింహారావు 103వ జయంతి సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ దేశాలలో ఆర్థికంగా, శక్తివంతంగా భారత్ అభివృద్ధి చెంద డానికి ఆయనే పునాదులు వేశారని పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన తెలంగాణబిడ్డ పీవీ నాడు చేపట్టిన ఆర్థిక సంస్కరణల బాటలో భారతదేశం మొత్తం నడుస్తోందన్నారు. రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన జీవితం నుంచి తెలంగాణ యువత స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.






