16 July, 2026 | 8:28 PM

అభివృద్ధి పనులకు ఇసుక రవాణా ఆపొద్దు

06-06-2024 02:09 AM

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వ అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాలకు ఇసుక తరలింపునకు అనుమతులు ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కాటారం మండలం విలాసాగర్ సమీపంలోని మానేరు ఇసుక రీచ్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాటారం మండలంలోని పలు ప్రభుత్వ అభివృద్ది పనులకోసం మానేరు నుంచి ఇసుక రవాణాకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈ రీచ్ ద్వారా ఇతర కాంట్రాక్ట్ పనులకు,ప్రైవేట్ నిర్మాణాల కోసం ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మైనింగ్ అధికారి జయరాజు, భూగర్బ జలవనరుల శాఖ అధికారి శ్రీనివాసరావు, కాటారం తహసీల్దార్ నాగరాజు, ఇరిగేషన్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.