మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
06-06-2024 02:06 AM
జయశంకర్ భూపాలపల్లి (ములుగు), జూన్ 5 (విజయక్రాంతి): అభం శుభం తెలియని అమాయక ఆదివాసీల ప్రాణాల మీదకు తెచ్చే మావోయిస్టు ఉద్యమాలు తమకు వద్దంటూ బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం కొం గల గుట్టపై మందుపాతర పేలి ఏసు అనే వ్యక్తి మృతిచెందిన నేపథ్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. అడవికి వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి వస్తారా? లేదా? అనే భయం తమకు వద్దన్నారు. మావోయిస్టులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదన్నారు.






