16 July, 2026 | 8:12 PM

బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు

06-06-2024 02:12 AM

నిజామాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కు అయిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆరోపించారు. నగరం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కనీసం తన ఏజెంట్లను సైతం నియమించకపోవడమే అందు కు నిదర్శమన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ ఎన్నికల్లో లబ్ధిపొందిందన్నారు.

తాజా ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ గడిచిన ఐదేళ్లలో ఏ హామీ నెరవేర్చలేదని, ఇప్పుడు గెలిచి మా త్రం ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెలిపించే విషయంలోనూ అర్వింద్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని గుర్తుచేశారు. అర్వింద్ తాను తెచ్చిన పసుపు బోర్డుతోనే పసుపు పంటకు ధర పెరిగిందని అంటున్నారని, తాను తెచ్చిన పసుపు బోర్డు ఎక్కడ నెలకొల్పారో తెలపాలని డిమాండ్ చేశారు.