17 March, 2026 | 2:56 AM

కోహ్లీని తక్కువ అంచనా వేయొద్దు

10-11-2024 12:00 AM

దుబాయ్: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. బోర్డర్ టెస్టు సిరీస్‌లో కోహ్లీ కీలకమయ్యే అవకాశముందన్నాడు. పాంటింగ్ మాట్లాడుతూ.. ‘కోహ్లీని తక్కువ అంచనా వేయ లేం. ఆసీస్ టూర్‌లో కోహ్లీ తన తడాఖా చూపించనున్నాడు. తన ఫామ్‌పై వస్తున్న సందేహాలకు బ్యాటుతోనే సమాధానం చెప్పనున్నాడు’ అని అన్నాడు. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల్లో కలిపి కోహ్లీ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.