calender_icon.png 7 February, 2026 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచార కార్యక్రమం

07-02-2026 03:18:28 PM

ఆర్మూర్,ఫిబ్రవరి07(విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ, 31వ, 35వ వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు కోడిగల మల్లయ్య, బొప్పన ప్రసాద్, సడక్ వినోద్ వార్డులలో  పర్యటించి ఆట్టహాసంగా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటా ప్రచార కార్యక్రమంలో  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే ఆర్మూరుని ఇంకా అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని వినయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రకటించిందనీ, అన్ని గ్యారెంటీలను నెరవేర్చడంతోపాటు మహిళలకు ఉచిత బస్సు పథకం గాని రేషన్ లో సన్న బియ్యం గాని ఉచిత విద్యుత్తు గాని ఇలా ఎన్నింటినో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చి అట్టడుగు నా ఉన్న అణగారిన వర్గాల ప్రజలకు పథకాలను చేరువ చేసింది.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఘనవిజయం అందువల్ల చేతి గుర్తుకి ఓటెయ్యాలని ఆర్మూరు నియోజక వర్గాన్ని గాని ఆర్మూర్ పట్టణాన్ని గాని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల అధ్యక్షులు,  వార్డు కాంగ్రెస్ నేతలు, మహిళా కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు.