సిర్గాపూర్ కేజీబీవీలో రెండు అతిథి అధ్యాపకుల పోస్టులు ఖాళీ
25-06-2026 11:33 AM
సిర్గాపూర్ జూన్ 25(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో రెండు అతిథి అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సంతోషి కుమారి తెలిపారు. ఇందులో ఒక తెలుగు, ఇంగ్లీష్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. ఆసక్తి కలవారు, అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు పాఠశాల కార్యాలయాన్ని 25-27 తేదీ లోపు అప్లయ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన నిరుద్యోగ యువతులు వినియోగించుకోవాలని కేజీబీవీ ప్రిన్సిపాల్ సంతోషి కుమారి కోరారు.






