25 June, 2026 | 12:48 PM

విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం

25-06-2026 11:35 AM

ఖమ్మం రూరల్ జూన్ 25 (విజయక్రాంతి): విదేశీ పర్యటన ముగించుకొని ఖమ్మం చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎదులాపురం మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్ నాయకుడు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. విదేశీ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన మంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖమ్మం జిల్లా అభివృద్ధికి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొనగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.