22 March, 2026 | 4:58 AM

‘డబుల్’ ఇళ్లను సిద్ధం చేయాలి

31-07-2024 12:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వారం రోజుల్లో  ప్రారం భానికి సిద్ధం చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎల్బీనగర్ బాకారం వద్ద డబుల్ బెడ్రూమ్‌ల సముదాయాన్ని పరిశీలించిన ఆయ న.. నిర్మాణ పనులు పూర్తయినందున ఇళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. సికింద్రాబాద్ ఆర్డీవో దశరథ్ సింగ్, హౌసింగ్ డీఈ గంగాధర్, తహసీల్దార్ రాణా ప్రతాప్‌సింగ్, ఏఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.