11 August, 2026 | 11:49 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా వెండి కాయిన్స్ స్వాధీనం

11-08-2026 10:44 AM

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా వెండి నాణేలు పట్టుబడ్డాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద ఏడు కిలోల వెండి కాయిన్స్ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలోని చెకింగ్ పాయింట్ వద్ద ప్రయాణికుడి దగ్గర వెండి కాయిన్స్ ను ఎయిర్పోర్ట్ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. వెండి నాణేలకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాణేల లెక్కింపు, వాటి విలువ, రవాణా వెనుక ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యల కోసం కస్టమ్స్, ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు.