మోరంచకు పెరుగుతున్న వరద ఉధృతి
29-07-2026 09:48 AM
మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షం
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
భూపాలపల్లి/గణపురం, జులై 29 (విజయక్రాంతి): తుఫాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షంతో మోరంచ వాగుకు వరద ఉధృతి పెరుగుతుంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తయినప్పటికీ భారీ వర్షాలు కురవకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు . తుఫాను ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో పై మండలాల్లోని వరద నీరు పెరుగుతుండడంతో మోరంచకు వరద పెరిగింది. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది.






