29 July, 2026 | 10:20 AM

త్రీఫేస్ కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాము

29-07-2026 09:45 AM

విద్యుత్తు లైన్ ఏర్పాటు చేయించండి. 

మాజీ ఎంపీకి విన్నవించిన ఆదివాసీలు.

బోథ్, జులై 28 (విజయక్రాంతి): తమ గ్రామానికి త్రీ ఫేస్ విద్యుత్( three phase electricity) సరఫరా లేకపోవడంతో గురవుతున్నామని మహదుగూడ గ్రామానికి చెందిన ఆదివాసీలు మంగళవారం మాజీ ఎంపీ సోయం బాబురావు విన్నవించారు. విద్యుత్ లైన్ ఏర్పాటుకు మంజూరైన అటవీ శాఖ వారి అడ్డంకుల వల్ల లైవ్ అర్ధాంతంగా ఆగిపోయిందని గిరిజనులు మాజీ ఎంపీకి వివరించారు. వ్యవసాయం చేసేందుకు త్రీఫేస్ విద్యుత్తు లేకపోవడం వల్ల సాగునీటి వసతికి నోచుకోలేకపోతున్నామన్నారు. అయితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్ అర్ధాంతంగా విడిచిపెట్టి వెళ్లిపోయారని మాజీ ఎంపీ దృష్టి తీసుకువచ్చారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా చూస్తామన్నారు.

అటవీ శాఖ వారి కఠిననిబంధనల వల్ల ఈ దుస్థితి నెల కుందని మాజీ ఎంపీ ఆదివాసీ రైతులకు వివరించారు. అటవీ ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలను సైతం కాళీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు . కాగా ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పైన డీఎన్ఏ లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వ్యక్తి ఓటర్గా నమోదు అయ్యేవిధంగా చూడాలని సూచించారు. ఓటరుగా నమోదు కాకపోతే ప్రభుత్వపరంగా అందే  పథకాలు భవిష్యత్తులో అందకుండా పోతాయని పేర్కొన్నారు. సోనాల మండలంలోని పార్టీ బి, కేశవ్ గూడ ,నాగు గూడ, ఘన్పూర్, తదితర గ్రామాలలో పర్యటించి ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై పరిశీలించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కన్వీనర్ గాజుల పోతన్న పలు గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.