బుద్ధ విహార్‌లో భీమ్ దీక్షలు
24-03-2026 05:35 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ బుద్ధ విహార్‌లో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో 9వ రోజు కొనసాగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భీమ్ దీక్ష జ్ఞాన దీక్షలు చేపట్టారు ముందుగా గౌతమ బుద్ధుడు విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి, జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి పంచశీల ప్రార్థన చేశారు. 8 మంది ఉపాసకులు 1 దీక్షలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ అధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి మధుకర్ మునేశ్వర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.




