15 June, 2026 | 2:52 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

నిర్మల్ కవికి సన్మానం

13-06-2026 04:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ కు చెందిన సంస్కృత భాషా ప్రచార సమితి ఆదిలాబాదు, నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత డా బి వెంకట్ హైదరాబాదు రవీంద్రభారతిలో పద్యగాన అనుమానం అందుకున్నారు రవీంద్రభారతి సమావేశమందిరములో తెలంగాణభాషా సాంస్కృతిక శాఖ, తెలుగుభాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన  "అక్కి నర్సింలు గౌడ్ రచించిన బాలరామాయణం పుస్తకావిష్కరణ సభ, పర్యావరణం కాలుష్య నివారణం అను కవిసమ్మేళనములో పాల్గొని" , తన స్వీయపద్యాలను గానం చేశారు.

 ముఖ్య అతిథులు- ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, తెలంగాణభాషా చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్, కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్మన్ రాధాకుసుమ‌ ,పంచపదుల ప్రక్రియ రూపకర్త‌ పాండురంగ విఠల్  చేతులమీదుగా పద్యగాన సన్మానమును స్వీకరించారు.

ఈ సందర్భంగా డా కావేరి ఫౌండేషన్ చైర్మన్ డా అప్పాల చక్రధారి,తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ళ హన్మంతు,కవియాత్ర జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్,నిర్మలభారతి సాహిత్య సాంస్కృతిక కళా సామాజిక సేవా క్షేత్రం అధ్యక్షులు తోడిశెట్టి పరమేశ్వర్,కవులు- డా దామెర రాములు,డా ఉప్పు కృష్ణంరాజు తదితరులు వెంకట్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు