1 June, 2026 | 2:46 AM

టీపీసీసీ డాక్టర్స్ సెల్ ములుగు జిల్లా చైర్మన్‌గా డాక్టర్ రవిబాబు

01-06-2026 01:30 AM

ములుగు (మహబూబాబాద్) మే 31 (విజయక్రాంతి): టీపీసీసీ డాక్టర్స్ సెల్ , మెడికల్ అండ్ హెల్త్ విభాగం ములుగు జిల్లా చైర్మన్ గా డాక్టర్ ఆనందపు రవిబాబును నియమించిన సందర్భంగా  ఆదివారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క రవి బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, జిల్లాలో మార్పు కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.తనపై ఎంతో నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి రవిబాబు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా డాక్టర్లను సమన్వయం చేసి ప్రజా సేవలో ముందుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, మల్లంపల్లి సర్పంచ్ ల్యాద శ్యామ్రావు, శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.