1 June, 2026 | 2:46 AM

రాత్రి పూట పోలీసుల గస్తీ

01-06-2026 01:31 AM

మహబూబాబాద్, మే 31 (విజయక్రాం తి): జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేర కు బయ్యారం సర్కిల్ పరిధిలో గంజాయి వినియోగానికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు రాత్రి గస్తీ ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బయ్యారం సీఐ రవీందర్ ఆధ్వర్యంలో బయ్యారం ఎస్త్స్ర ప్ర శాంత్, గార్ల ఎస్త్స్ర సాయి కుమార్ పోలీసు సిబ్బంది సంయుక్తంగా అర్ధరాత్రి వేళల్లో గంజాయి వినియోగానికి ఆస్కారం ఉన్న అనుమానిత ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, గ్రామాల శివార్లు, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదలు, ఖాళీ స్థలాలు, జనసంచారం తక్కువగా ఉండే అంతర్గత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి లేదా ఇతర మత్తు పదార్థా ల అక్రమ రవాణా, విక్రయం, వినియోగానికి పాల్పడే వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. అలాగే మత్తు పదార్థాలకు బానిసైన యువతకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ర్పాటు చేసిన డీ అడిక్షన్ సెంటర్ ద్వారా కౌ న్సెలింగ్, వైద్య చికిత్స అందుబాటులో ఉం దని తెలిపారు. ప్రజలు తమ పరిసర ప్రాం తాల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యక లాపాలు గమనించినట్లయితే వెంటనే సమీ ప పోలీస్ స్టేషన్కు లేదా మహబూబాబాద్ జిల్లా పోలీసు హెల్ప్లైన్ 8712656999 కు సమాచారం అందించాలని పోలీసులు కో రారు. సమాచారం అందించిన వారి వివరా లు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.