7 July, 2026 | 4:01 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

వైద్య వృత్తిలో డా.యాసీనా భాను మరెందరికో స్ఫూర్తిగా నిలవాలి

18-05-2025 11:11 PM

బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

కుత్బుల్లాపూర్,(విజయ క్రాంతి): వైద్య వృత్తిలో డాక్టర్ యాసీనా భాను మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి మధురానగర్లో నిర్వహించిన డాక్టర్ యాసీనా భాను అభినందన సభ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై 2025 నీట్ ఎస్ ఎస్ పరీక్షలో జాతీయస్థాయిలో 11 వ ర్యాంకు సాధించిన డాక్టర్ యాసీనా భానును శాలువాతో సత్కరించి వైద్య వృత్తిలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... 2025 నీట్ ఎస్ ఎస్ పరీక్షలో జాతీయస్థాయిలో 11 వ ర్యాంకు సాధించిన డాక్టర్ యాసీనా భాను రానున్న రోజుల్లో వైద్య వృత్తిలో మరింత ఉజ్వల భవిష్యత్తు ను రూపొందించుకుని, మరింత మంది వైద్యులను తయారు చేసేందుకు తన తోడ్పాటును అందించాలన్నారు.

కూతురును డాక్టర్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేసిన వారి తలిదండ్రులు డాక్టర్ రషీద్, నర్జీన్ లను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం కాలనీలో నిర్మిస్తున్నటువంటి అష్టలక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, నాయకులు సాంబశివ రెడ్డి, బొబ్బా శ్రీనివాస్, సతీష్ రెడ్డి, మహమ్మద్ సలీం, కాలనీవాసులు హేమంత రావు, మద్దయ్య, విష్ణువర్ధన్ రావు, రాంబాబు, వెంకయ్య, నాగేశ్వర్ రావు,కోటి రెడ్డి,మురళి,నవీన్, సుకవాసి శ్రీనివాస్,భరత్,అప్పాల రాజు,భాష,గంగాధర్, శ్రీలక్ష్మి, సుమిత్ర  తదితరులు పాల్గొన్నారు.