19-05-2025 12:00:00 AM
సిద్దిపేట, మే 18 (విజయక్రాంతి): సిద్దిపేట ఆధ్యాత్మిక, ధార్మిక సామజిక సేవలకు నెలవుగా మారిందని ఇటీవలే కేదార్ నాథ్ యాత్రికులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించి జులై 3 నుండి అమర్ నాథ్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 14 సంవత్సరాలుగా అమర్ నాథ్ లో సిద్దిపేట అన్న ప్రసాదం అందజేయడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని హరీష్ రావు అన్నారు.
అందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పారు. మంచు కొండల్లో అమర్ నాథ్ యాత్ర కు వచ్చే భక్తులకు మీరు చేసే సేవా గొప్పదని అ ఫలం సిద్దిపేట ప్రజలందరికి దక్కలాన్నారు. ఈ సందర్బంగా అమర్ నాథ్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరణ చేసారు.