1 June, 2026 | 9:10 PM

కబరస్థాన్లో మంచినీటి బోరు ఏర్పాటు

01-06-2026 08:33 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడు కబరస్థాన్లో ఎమ్మెల్యే సొంత నిధులతో మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. కబరస్థాన్లో మంచినీటి వసతి లేక అంత్యక్రియల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గతంలో కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మహ్మద్ పాషా  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన కబరస్థాన్లో బోరు ఏర్పాటు చేయించడంతో మైనార్టీ నాయకులతో పాటు స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రహరీగోడ లేకపోవడంతో ఆ నిర్మాణం కూడా త్వరలో చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు మైనార్టీ నాయకులు తెలిపారు.