15-01-2026 12:10:47 AM
శంకర్‌పల్లి పట్టణంలో ‘అరైవ్ అలీవ్‘ కార్యక్రమానికి హాజరైన
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య..
శంకర్ పల్లి, జనవరి 14: వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ వాహనాలను నడిపి తమ ప్రాణాలు కాపాడుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. బుధవారం శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ పై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలీవ్‘ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకోకూడదని సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడిపితే తప్పనిసరిగా ప్రమాదాలు జరుగుతాయని, వేగ నియంత్రణలో వాహనాలు నడపాలని తెలిపారు. పోలీసులు సూచించిన భద్రతను ప్రతి ఒక్క వాహనదారుడు అవగాహన చేసుకోవాలని చెప్పా రు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లను వాడాలన్నారు. అలాగే వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
చేవెళ్ల డివిజన్ ఏసిపి కిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తప్పనిసరిగా వాహనదారులు తమ వాహనాలను వేగ నియంత్రణలో నడుపుకోవాలని తెలిపారు. అధిక వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు నేటి నుండి తప్పని సరిగా హెల్మెట్లు తలపై పెట్టుకుని వాహనాలు నడపాలన్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని ద్విచక్ర వాహనం నడపాలని తెలిపారు. హెల్మెట్ లేకుంటే ఆయా కార్యాలయాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటారని చెప్పారు. నో హెల్మెట్ -నో ఎంట్రీ లోగోను ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆవిష్కరిం చారు. వాహనాలు వేగ నియంత్రణలో నడుపుతామని వచ్చిన వారితో సీఐ ప్రమాణం చేయించారు. సిఐ శ్రీనివాస్ గౌడ్, శంకర్ పల్లి ఏఎంసి చైర్మన్ చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మార్కెట్ సెక్రెటరీ పలు గ్రామాల సర్పంచులు, పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, సిబ్బంది, పలు గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.