15-01-2026 12:12:47 AM
ములుగు,జనవరి14(విజయక్రాంతి): బో గి పండుగ రోజు ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో మీ సేవ నిర్వహకుడు తాళ్లపెల్లి వీర కిషోర్ గౌడ్ (40) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. భార్య స్వాతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 14 సంవత్సరాల క్రి తం నర్సంపేట డివిజన్ ముత్తోజిపేటకు చెందిన కిషోర్ బతుకుదెరువు కోసం మంగపేట వచ్చి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద మీ సేవ నడుపుతున్నాడు.
2012లో ములుగు జిల్లా కేంద్రానికి చెందిన స్వాతిని వివాహం చేసుకుని ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత కిషోర్ మద్యానికి బానిసైనట్లు తెలిపింది. నిత్యం మద్యం మత్తులో తూగుతున్న కిషోర్ గ్రామంలో అప్పులు చేసి ఇబ్బందులు పడుతుండగా బార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో కిషోర్ మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డట్లు స్వాతి తెలిపింది. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.