calender_icon.png 16 January, 2026 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం

15-01-2026 12:09:38 AM

శామీర్ పేట్, జనవరి 14: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే  విజయమని మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  వార్డు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.

గ్రామాలను ,పట్టణాలను  అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ అని, రేపు అభివృద్ధి చేసేది కూడా తామేనని చెప్పారు. ప్రజలను ఓటడిగే హక్కు తమకే ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మూడు చింతలపల్లి గ్రామ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, జెర్రిపోతుల నరసింహులు, వేణుగోపాల్, రాజేంద్రప్రసాద్, జెయల పాండు తదితరులు పాల్గొన్నారు.